బొలెరోలో ‘రేషన్’ దందా!
06-10-2026 | 10:30pm
5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
పెంచికల్‌పేట్ (విజయక్రాంతి): మండలములోని పెద్దవాగు వంతెన వద్ద మంగళవారం రోజున సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని(PDS Rice) పోలీసులు పట్టుకున్నారు. దహెగాం నుంచి పెంచికల్‌పేట్ వైపు బొలెరోలో బియ్యం తరలిస్తుండగా తనిఖీ చేసి బియ్యం తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకునికేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు.