'వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలి

06-10-2026 | 10:00pm

బోధన్ (విజయక్రాంతి): వికలాంగులకు ఆర్టీసీ(RTC)లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎన్,పి,అర్,డి. జిల్లా నాయకులు గైని రాములు, ఏశాల గంగాధర్ డిమాండ్ చేశారు. బోధన్ మండలం పెంటకుర్తిలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్లో అన్ని ఆర్టీసీ బస్సుల్లో వికలాంగుల పాసులను అనుమతించాలని కోరారు. అక్టోబర్ 8న బస్ భవన్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు