దండేపల్లిలో పోషణ మాసోత్సవ వేడుకలు

06-10-2026 | 10:23pm

దండేపల్లి, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవంలో భాగంగా మంగళవారం మంచిర్యాల జిల్లా(Mancherial district) దండేపల్లి సెక్టర్ లో సిటిజన్ అవేర్నెస్ కాంపెయిన్, అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు నిర్వహించారు. అభివృద్ధి లోపాలున్న పిల్లలను గుర్తించడం, అవసరమైన వైద్య ఆరోగ్య సేవల కోసం రిపేర్ చేశారు.

రోజు తినే ఆహార పద్ధతుల్లో రైస్, ఉప్పు, చక్కెర, నూనెల వాడకాన్ని తగ్గించి అన్ని రకాల పోషకాలు సమపాళ్లల్లో ఉండేలా చూసుకోవాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, పోషణ లోపం లేని ఆరోగ్య తెలంగాణకు అందరం కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా పోషకాలతో కూడిన వంటకాలను ప్రదర్శించి, అందులో ఉన్న పోషక విలువల గురించి వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దండెపల్లి సర్పంచ్ అజ్మీర రాజేశ్వర్, ఉప సర్పంచ్ సిరికొండ నవీన్, సొసైటీ చైర్మన్ ముత్యాల శ్రీను, నాయకులు వెంగళరావు, గ్రామ కార్యదర్శి హరీష్ రావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి, హెచ్ఎం సాయి దీపిక, ఐకెపి సీఏ అనురాధ, దండేపల్లి సెక్టార్ అంగన్వాడి టీచర్లు, ఏరియా లబ్ధిదారులు, గర్భిణిలు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు