విద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట
- గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్
- ప్రభుత్వ పాఠశాలలో ఉచిత దుస్తుల పంపిణీ
గణపురం, అక్టోబర్ 06 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేస్తుందని గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్(Gram Panchayat Sarpanch Katkuri Radhika Srinivas) అన్నారు. మంగళవారం గణపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీతో పాటు ప్రాథమిక భాషా, గణిత సామర్థ్యాల అభివృద్ధి ప్రయోగశాలను సర్పంచ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రాధిక మాట్లాడుతూ విద్యార్థుల్లో చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రయోగశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఏకరూప దుస్తులతో విద్యార్థుల్లో సమానత్వ భావన, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ అప్రోజ్ అహ్మద్ ప్రధానోపాధ్యాయులు కాయిత జలంధర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేసు సతీష్ కుమార్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దూలం కుమారస్వామి గౌడ్, ఉపాధ్యాయులు మంద శ్రీధర్, దాసరి చంద్రమౌళి, గుండెగాని స్వర్ణలత, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ దూడపాక రజిత, సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.