ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్య పోరాటం

06-10-2026 | 11:08pm

ప్రజల ఓటు హక్కును కాపాడాలి

జనగామ లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు

మంథని, జనగామ, (విజయక్రాంతి): ఏఐసీసీ పిలుపు మేరకు జనగామలో డీసీసీ అధ్యక్షులు లకావత్ ధన్వంతి ఆధ్వర్యంలో ఇండియా కూటమి నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్రలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(TPCC State General Secretary Dudilla Srinu Babu) పాల్గొన్నారు. జనగామ రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వరకు పాదయాత్ర సాగింది. అనంతరం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఇండియా కూటమి చేపడుతున్న ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలతో పాటు పాత్రికేయులపై కూడా ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని కోరారు.

మరిన్ని వార్తలు