గాయపడిన ఎస్‌బీఐ లైఫ్ మేనేజర్‌కు పరామర్శ

30-10-2026 | 11:10pm

ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏజెన్సీ మేనేజర్ మేకల పద్మ, బృంద సభ్యులు

పెద్దపల్లి,(విజయక్రాంతి): రామగిరి మండలంలోని రత్నాపూర్ లో ఇటీవల రోడ్డు ప్రమాదం(Road accident)లో గాయపడి కరీంనగర్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌బీఐ లైఫ్ మేనేజర్ ఎలువాక కుమారస్వామి(SBI Life Manager Kumaraswamy)ని ఎస్బిఐ ఏజెన్సీ మేనేజర్ మేకల పద్మ, ఆమె బృంద సభ్యులు శుక్రవారం పరామర్శించారు. ఈ నెల ఈ నెల 28న బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారస్వామికి గాయాలయ్యాయి. ప్రమాదంలో దవడ ఎముక విరగడంతో కరీంనగర్‌లోని కేఈఏ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు.

ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏజెన్సీ మేనేజర్ మేకల పద్మ తన బృంద సభ్యులతో కలిసి ఆసుపత్రికి వెళ్లి కుమారస్వామిని కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుమారస్వామి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి విధుల్లో చేరాలని మేకల పద్మతో పాటు బృంద సభ్యులు ఆకాంక్షించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థించారు.

మరిన్ని వార్తలు