కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల గిరిజన డిక్లరేషన్ అమలుచేయాలి
-సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోతు హుస్సేన్ నాయక్
-గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నగేష్ రాథోడ్
హుజూర్ నగర్: కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్లలో ప్రవేశ పెట్టిన గిరిజన డిక్లరేషన్ అమలు చేయాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోతు హుస్సేన్ నాయక్,గిరిజన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నగేష్ రాథోడ్ అన్నారు.ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన గిరిజన గళం-తండాలో నిద్ర యాత్ర హుజూర్ నగర్ కు చేరుకున్న సందర్బంగా శుక్రవారం టౌన్ హాల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు...లంబాడిలకు మంత్రి పదవి ఇవ్వాలని నామినేటెడ్ పదవుల్లో లంబాడీలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు.
తండా అభివృద్ధి బోర్డు తక్షణమే ఏర్పాటు చేసి ప్రత్యేక నిధిని కేటాయించాలని డిమాండ్ చేశారు.అర్హులైన గిరిజనులందరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నారు. గిరిజనుల ఓట్లతోనే గెలిచామన్న సీఎం రేవంత్ రెడ్డి నేడు తండాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. గిరిజనులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం మొండిచేయి చూపించిందన్నారు.గిరిజన గురుకులాల్లో విద్యార్థుల సమస్యలు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని నిర్మించి గోర్ ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
గిరిజనులపై దాడులు, హత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.పలు చోట్ల పోలీసులు గిరిజనుల పట్ల నిరక్ష్యంగా వ్యవరిస్తున్నారని, గిరిజనులను కేవలం ఓటుబ్యాంక్ గా మాత్రమే చూడొద్దని ప్రభుత్వం వారి అభివృద్ధికి బాటలు వేయాలాన్నారు.తండాలను గ్రామపంచాయతీలుగా చేసి,కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేసి గిరిజనుల పట్ల కెసిఆర్ తన ప్రేమను చాటుకున్నారన్నారు.ఈ కార్యక్రమంలో లంబాడా హక్కుల పోరాట సమితి జాతీయ కన్వీనర్ వెంకట్రాం,ధీరవత్ రవి,సుమన్,ధరావత్ రవీందర్,నాగు, రాజేశ్,వివిధ గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.