ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు

31-10-2026 | 12:51am

పంచాయతీ రికార్డులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు స్వాధీనం

రెండు రోజుల్లో కలెక్టర్‌కు నివేదిక

వెంకటాపూర్,(విజయక్రాంతి): మండలంలోని బూరుగుపేట గ్రామపంచాయతీ(Burugupeta Gram Panchayat)లో శుక్రవారం డీఎల్పీఓ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్పంచ్ రూ.2 లక్షలు డ్రా చేశారని ఉపసర్పంచ్ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పంచాయతీకి సంబంధించిన పలు రికార్డులు, ఎంబీ బుక్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, చెక్ రిజిస్టర్లను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌ల నుంచి వేర్వేరుగా వివరణ తీసుకున్నారు. నకిలీ బిల్లులు, బినామీ పాలనకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపైనా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. తనిఖీలకు సంబంధించిన పూర్తి నివేదికను రెండు రోజుల్లో కలెక్టర్‌కు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు