ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఎక్స్పోజర్ సందర్శన
జగిత్యాల,(విజయక్రాంతి): పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్లో నాయకత్వ లక్షణాలు, పరిపాలనా నైపుణ్యాలు, విద్యా నిర్వహణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Exposure Visit to Strengthen Leadership in Headmasters of PM SHRI Schools” కార్యక్రమంలో భాగంగా, చంద్రశేఖర్ రెడ్డి (ఎ ఎం ఓ) ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని 20 మంది పీఎంశ్రీ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) ను సందర్శించారు. ఈ ఎక్స్పోజర్ విజిట్ ద్వారా విద్యారంగంలో నూతన ఆవిష్కరణలు, ఆధునిక విద్యా విధానాలు, సమర్థవంతమైన పాఠశాల నిర్వహణ పద్ధతులు, నాయకత్వ లక్షణాల అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన పొందే అవకాశం కలిగింది.
ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన నూతన ఆలోచనలు, ఉత్తమ పద్ధతులను ఈ సందర్శన ద్వారా తెలుసుకున్నారు. ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ అయిన IISc సందర్శన ఉపాధ్యాయులకు విజ్ఞానాన్ని విస్తరించడంతో పాటు, పాఠశాలల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని, ఈ కార్యక్రమం ద్వారా పొందిన అనుభవాలు జగిత్యాల జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని ప్రధానోపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. నాణ్యమైన విద్య, సమర్థవంతమైన నాయకత్వం, ఆదర్శవంతమైన పాఠశాలలు అనే లక్ష్య సాధనలో ఇటువంటి ఎక్స్పోజర్ విజిట్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.