చేనేత సంఘానికి అదనపు నగదు పరపతి మంజూరు చేయాలని వినతి

31-10-2026 | 01:00am

మునుగోడు,(విజయక్రాంతి): చేనేత సహకార సంఘానికి అదనపు క్యాష్ క్రెడిట్ (నగదు పరపతి) మంజూరు చేయాలని కోరుతూ ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ న్యూఢిల్లీ బోర్డు డైరెక్టర్, సంఘం అధ్యక్షురాలు కర్నాటి వజ్రమ్మ వెంకటేశం నల్గొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా సంఘం ఆర్థిక అవసరాలు, చేనేత కార్మికుల సంక్షేమం కోసం అదనపు నగదు పరపతి అవసరాన్ని కలెక్టర్‌కు వివరించారు. సంఘం కార్యకలాపాలను మరింత విస్తరించడంతోపాటు కార్మికులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అదనపు క్యాష్ క్రెడిట్ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి దోర్నాల నరేందర్, చిలుకూరి అంజయ్య ఉన్నారు.

మరిన్ని వార్తలు