చర్లపల్లిలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు
31-10-2026 | 12:44am
జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) ఆదేశాల మేరకు చర్లపల్లి గ్రామంలో సర్పంచ్ జోగు లక్ష్మమ్మ వెంకటరమణ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు(MLC Voter Registration) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేశారు. మరో 45 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు సర్పంచ్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తిరుపతి, చంద్రకళ, నర్సింలు యాదవ్, నరేందర్ గౌడ్, మురళి గౌడ్, శ్రీశైలం గౌడ్, వెంకటయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.