రీ భూ సర్వే ప్రారంభించిన తహసీల్దార్ ఝాన్సీ

30-10-2026 | 11:33pm

పాల్గొన్న జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సభ్యుడు కురుమన్న

మల్దకల్: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal district) మల్దకల్ మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వే కార్యక్రమాన్ని(Land re survey program) శుక్రవారం మల్దకల్ మండలంలోని ఎద్దులగూడెం గ్రామంలో మండల తహసీల్దార్ ఝాన్సీ, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కురుమన్న కలిసి ప్రారంభించారు. గ్రామ రైతులతో కలిసి కొబ్బరికాయ కొట్టి రీ సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ ఝాన్సీ మాట్లాడుతూ మండలంలోని ఎద్దులగూడెంతో పాటు అన్ని గ్రామాల్లో వ్యవసాయ భూములు, నాలాలకు సంబంధించి రీ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. భూముల కొలతల ఆధారంగా సరిహద్దులను నిర్ధారించి ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ బీచుపల్లి, జీపీఓ లక్ష్మణ్, శేఖర్, జిల్లా మాజీ ఉపసర్పంచుల సంఘం అధ్యక్షుడు రంజిత్ కుమార్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు