ఇండోర్ స్టేడియం శంకుస్థాపన
సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలో క్రీడారంగ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. పట్టణంలోని JVR మున్సిపాలిటీ కార్యాలయం(JVR Municipality Office) పక్కన సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్(MLA Dr. Matta Ragamayee Dayanand) శుక్రవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో పురపాలక సంఘం నగర అభివృద్ధి నిధులతో ఈ స్టేడియాన్ని నిర్మించనున్నారు.
ఈ స్టేడియం అందుబాటులోకి వస్తే సత్తుపల్లి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. యువత క్రీడల్లో రాణించేందుకు, తమ ప్రతిభను వెలికితీసేందుకు మెరుగైన వేదిక లభించనుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర ఐఏఎస్ , రాష్ట్ర టి జి ఐ డి సి. మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు పాల్గొన్నారు.
అలాగే కల్లూరు ఆర్డీవో అజయ్ యాదవ్,సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహానా కమల్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, మున్సిపల్ కమిషనర్ నరసింహ, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.