గాయపడిన జర్నలిస్టు కుమారస్వామికి పరామర్శ

30-10-2026 | 11:22pm

ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు

ముత్తారం,(విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముత్తారం మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఏలువాక కుమారస్వామిని కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు నూనేటి కృష్ణ, బాలసాని రాజ్‌కుమార్ శుక్రవారం కరీంనగర్ లో పరామర్శించారు. రెండు రోజుల క్రితం రామగిరి మండలం పన్నూరు సమీపంలో రహదారిపై అకస్మాత్తుగా పంది అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడిన కుమారస్వామికి గాయాలయ్యాయి.

దీంతో కుటుంబ సభ్యులు ఆయనను కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నూనేటి కృష్ణ, బాలసాని రాజ్‌కుమార్ ఆసుపత్రికి వెళ్లి కుమారస్వామిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు