ఇసుక ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
జుక్కల్,(విజయక్రాంతి): జుక్కల్ మండలం(Jukkal mandal) బస్వాపూర్ గ్రామానికి చెందిన బొంబాయి మేస్త్రి అనే వ్యక్తి ఇసుక ట్రాక్టర్ ఢీకొని మృతి(Sand Tractor Accident) చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం బిచ్కుంద మండలం హస్గుల్ మంజీరా పరివాహక ప్రాంతం నుంచి ఇసుక తీసుకుని జుక్కల్ కు వస్తున్న ట్రాక్టర్ బైక్ పై ఉన్న వ్యక్తిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు.
ఫత్లాపూర్ నుంచి మహ్మదాబాద్ మీదుగా జుక్కల్ కు వస్తున్న ట్రాక్టర్ ఈ రెండు గ్రామాల మధ్యలో ఈ ప్రమాదం జరిగింది అని పేర్కొన్నారు. ప్రమాదం జరగగానే ట్రాక్టర్ డ్రైవర్ పారిపోతుండగా స్థానికులు గమనించి మహ్మదాబాద్ వద్ద ఆయన పట్టుకున్నట్లు చెప్పారు. పోలీసులు వివరాలు చెప్పాల్సి ఉంది.