షార్ట్ సర్క్యూట్ తో రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం

06-10-2026 | 08:18pm

ధాన్యం దగ్ధం.. రూ.20 లక్షల నష్టం

సుల్తానాబాద్, అక్టోబర్ 06 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి శివారులోని సదాలక్ష్మి రైస్‌మిల్లులో(Sadalakshmi Rice Mill) మంగళవారం షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో డ్రైయర్‌తో పాటు అందులో ఉన్న ధాన్యం దగ్ధమ‌యింది.దీంతో సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు మిల్లు యజమాని పరిపాటి తిరుపతిరెడ్డి తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది అన్నారు, 

ఉదయం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హమాలీలు, గుమస్తాలు అప్రమత్తమై యజమానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న యజమాని, కార్మికులు మిల్లులోని బోర్‌ నీటితో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు, మంటలు భారీగా చెల‌రేగ‌డంతో ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి  మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు