యాదవ సంఘం మండల అధ్యక్షుడికి ఘన సన్మానం

06-10-2026 | 06:09pm

చేలుకల జితేందర్ యాదవ్‌కు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం శుభాకాంక్షలు

ముత్తారం, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ముత్తారం మండల యాదవ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన చేలుకల జితేందర్ యాదవ్‌(Chelukala Jitender Yadav)ను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, ముత్తారం మండల మాజీ జెడ్పీటీసీ చొప్పరి సదానందం, సర్పంచ్ పేగుడ తిరుమల కుమార్, కాలేశ్వరం దేవస్థానం డైరెక్టర్ తాటిపెల్లి రాజన్న, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బక్కతట్ల వినీత్ తదితరులు జితేందర్ యాదవ్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల కాంగ్రెస్ శాఖల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు