నకిలీ పోలీసుల మోసం
06-10-2026 | 10:47pm
8.5 తులాల బంగారం మాయం..
బోధన్ (విజయక్రాంతి): బోధన్ బైపాస్ రోడ్డు(Bodhan Bypass Road)లో మఫ్టీ పోలీసులమంటూ ఇద్దరు దుండగులు వృద్ధురాలిని మోసగించారు. సాలంపాడు క్యాంప్కు చెందిన తిరుపతమ్మ ఆసుపత్రికి వెళ్తుండగా రైతు ధాబా వద్ద బైక్పై వచ్చిన ఇద్దరు అడ్డగించారు. నగలు వేసుకోవద్దని చెప్పి, వాటిని తీయించి బ్యాగ్లో పెడుతున్నట్లు నటించి దృష్టి మళ్లించారు. బాధితురాలి నుంచి 8.5 తులాల బంగారం, రూ. 2 వేలు కాజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.