ఘనంగా ఓటరు అవగాహన సదస్సు
నిర్మల్ నవంబర్ 26 ( విజయక్రాంతి) : ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Government Degree College), నిర్మల్లో ఓటరు(voter) అవగాహన కార్యక్రమంలో భాగంగా నేడు వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు(Quiz competitions) విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ ఆర్డీఓ దేవదాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను(Students') ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు(Right to vote) యొక్క ప్రాముఖ్యత, ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆర్డీఓ గారు విద్యార్థులకు వివరించారు. యువత ఓటరు నమోదుపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, సమాజంలో ఇతరులకు కూడా ఓటు ప్రాముఖ్యతను తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా “ఓటు యొక్క ప్రాముఖ్యత” అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. అలాగే ఓటర్ల జాబితా తయారీ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVMలు), వీవీప్యాట్ (VVPAT), పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు ప్రక్రియ వంటి అంశాలపై క్విజ్ పోటీ నిర్వహించారు.
ఈ పోటీలలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో ప్రజాస్వామ్య విలువలు, బాధ్యతాయుతమైన పౌరసత్వం మరియు ఎన్నికల ప్రక్రియపై అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని కార్యక్రమంలో పేర్కొన్నారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అధ్యాపకులను, సిబ్బందిని మరియు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ అభినందించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు