ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
ముకరంపుర, సెప్టెంబర్ 12(విజయ క్రాంతి): కరీంనగర్ నగరం డివిజన్ అభివృద్ధిలో భాగంగా 42వ డివిజన్(division)లోని కాశ్మీర్ గడ్డ మునావర్ మసీదు వీధిలో నూతనంగా చేపడుతున్న సి.సి. రోడ్డు నిర్మాణ పనులకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. గతంలో 42వ డివిజన్ ఏ విధంగానైతే సమస్యలు లేని డివిజన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందో, అదే విధంగా కొత్తగా డివిజన్లో కలిసిన అన్ని ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.డివిజన్ లో కొత్తగా కలిసిన వివేకానంద స్కూల్ పరిసర ప్రాంతాల్లో కూడా త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభించి, స్థానిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ టి.చంద్రమౌళి పెద్దలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.