యువ ఆపద మిత్ర కిట్ల పంపిణీ

30-10-2026 | 05:11pm

నిర్మల్,అక్టోబర్ 30 ( విజయ క్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్‌లో ఎన్‌సీసీ క్యాడెట్లకు యువ ఆపద మిత్ర (Yuva Apada Mitra) కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన 22 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు ఈ నెలలో 32 (టి) బెటాలియన్ ఎన్‌సీసీ, ఆదిలాబాద్‌లో నిర్వహించిన 8 రోజుల యువ ఆపద మిత్ర శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు బెటాలియన్ నుంచి అందిన యువ ఆపద మిత్ర కిట్లను కళాశాలలో పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగ శ్రీనివాస్, ఎన్‌సీసీ ఆఫీసర్ డాక్టర్ బి. ఉమేష్ పాల్గొన్నారు. అలాగే అధ్యాపకులు డాక్టర్ సూర్యసాగర్, రమేష్ రెడ్డి, శ్రీహరి, డాక్టర్ ఎం. రజిత, రహమాన్ తదితరులు పాల్గొని క్యాడెట్లను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం చేయడానికి ఇటువంటి శిక్షణ ఎంతో ఉపయోగ పడుతుందని, క్యాడెట్లు నేర్చుకున్న నైపుణ్యాలను సమాజ సేవలో వినియోగించాలని సూచించారు.

మరిన్ని వార్తలు