నిర్మల్ లో సందడి చేసిన సినీనటి భాగ్యశ్రీ
08-10-2026 | 10:15pm
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్(Nirmal) జిల్లా కేంద్రంలో సినీ నటి భాగ్యశ్రీ(Actress Bhagyashree) సందడి చేశారు. పట్టణంలో మాంగళ్య షాపింగ్ మాల్(Mangalya Shopping Mall) ప్రారంభోత్సవానికి ఆమె రావడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చి సినీ నటిని చూస్తారు. ప్రేక్షకులకు అభివాదం తెలిపి నిర్మల్ కు రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం షాపింగ్ మాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జి నాగేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, షాపింగ్ మాల్ నిర్వహకులు పాల్గొన్నారు.