6 May, 2026 | 4:43 PM

గవర్నర్‌ను కలిసిన TVK అధినేత విజయ్

06-05-2026 03:58 PM

చెన్నై: తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ చెన్నైలోని లోక్ భవన్‌ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను( Governor Rajendra Vishwanath Arlekar) కలిశారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ గురవారం నాడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నెహ్రూ స్టేడియంలో విజయ్(TVK Chief Vijay) ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సుమారు 5 వేల మందికి పాసులు జారీ చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. ప్రమాణస్వీకారానికి రాహుల్ గాంధీ, ప్రముఖ నేతలు హాజరుకానున్నారు.

తమిళనాడులో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కజగం' (TVK)కు తమ ఎన్నికైన ప్రతినిధులు మద్దతు ఇస్తారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. తమిళనాడు వ్యవహారాల ఏఐసీసీ (All India Congress Committee) ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, తమిళనాడులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మద్దతును విజయ్ అధికారికంగా కోరిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

"భారత రాజ్యాంగంపై విశ్వాసం లేని ఏ మతతత్వ శక్తులనైనా ఈ కూటమికి దూరంగా ఉంచాలనే షరతుపైనే మా మద్దతు ఉంటుంది," అని ఆ ప్రకటన పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసాకాండ, విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఒక అధికారి బుధవారం తెలిపారు.