calender_icon.png 4 February, 2026 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్లంపేట్‌లో కాషాయ జెండా ఎగరాల్సిందే..

04-02-2026 01:38:16 AM

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 4(విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపల్ గడ్డపై కాషాయ జెండా ఎగరాల్సిందేనని మల్కాజిగిరి బిజెపి పార్లమెంట్ సభ్యులు  ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందని పార్టీ శ్రేణులు వెల్లడించారు. మంగళవారం ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలో మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థులతో పాటు వార్డు ఇన్చార్జి లతో ఎంపి ఈటల రాజేందర్ కీలక సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మల్కాజిగిరి బిజెపి ఎంపి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎల్లంపేట్ మున్సిపాలిటీ ఎన్నికలు బిజెపికి సాధారణ రాజకీయ పోటీ కాదని కాషాయ జెండాను ఎల్లంపేట్ మున్సిపల్ గడ్డపై గర్వంగా ఎగురవేయాల్సిన కీలక సమరం ఆసన్నమైందని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల నమ్మకాన్ని పొందా లంటే ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిత్యం ప్రజల మధ్య ఉండాలని ప్రజల సమస్యలల్లో భాగస్వాములు కావాలని అభ్యర్థులకు ఆయన సూచించారు.

అంతే కాకుండా ఎన్నికల వేళ మాత్రమే కనిపించే నాయకులను ప్రజలు విశ్వసించరని నిరంతరం ప్రజల కోసం పనిచేసే వారిని నిజమైన నాయకులుగా గుర్తిస్తారని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్లంపేట్ మున్సిపాలిటీ బిజెపి ఎన్నికల ఇన్చార్జి సత్యపాల్ రెడ్డి. రూరల్  జిల్లా ఇన్చార్జి సామ రంగారెడ్డి సీనియర్ నాయకులు నారెడ్డి నందారెడ్డి. పాతూ రి సుధాకర్ రెడ్డి.ఆర్ మల్లారెడ్డి.

మాజీ జిల్లా అధ్యక్షులు నాయకులు పట్లోళ్ల విక్రం రెడ్డి. మేడ్చల్ మాజీ సర్పంచ్ తాళ్లపల్లి మురళీధర్ గుప్తా. మేడ్చల్ బిజెపి రూరల్ జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్. పాతూరి ప్రభాక ర్ రెడ్డి.మాజీ బిజెపి కౌన్సిలర్ సముద్రాల హంస కృష్ణ గౌడ్. కోశాధికారి లవంగ శ్రీ కాంత్. ఎల్లంపేట్ మున్సిపల్ బిజెపి పట్టణ అధ్యక్షులు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్. మేడ్చల్ మున్సిపల్ పట్టణ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.