2 June, 2026 | 11:49 AM

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

02-06-2026 10:40 AM

ముకరంపుర, జూన్ 2(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్  యాదగిరి సునీల్ రావు ,కరీంనగర్ మున్సిపల్ కమిషనర్  ప్రఫుల్ దేశాయ్ ముఖ్య అతిథులుగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  ఈ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.