1 April, 2026 | 2:43 PM

Breaking News

రాజక్కపల్లిలో ఉచిత గాలికుంటు టీకాలు   •   రాజక్కపల్లిలో ఉచిత గాలికుంటు టీకాలు   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ   •   అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వైసీపీ వాకౌట్‌   •   లోక్‎సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు.. కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు   •   ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •  

క్రికెట్ టోర్నమెంట్ విన్నర్ గా రంగాపూర్

11-10-2025 08:38 PM

మొదటి బహుమతి 30,000 అందజేసిన లూబి మోటార్స్..

పినపాక (విజయక్రాంతి): పినపాక మండలం తోగూడెం గ్రామపంచాయతీ గోపాలరావుపేట గ్రామంలో దసరా, దీపావళి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్ రంగాపూర్, కాటాపూర్ జట్ల హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీలో విజేతగా రంగాపూర్ జట్టు నిలిచింది. విజేతలకు మొదటి బహుమతి 30 వేల రూపాయలు, షీల్డ్ లూబి మోటార్స్ సంస్థ నుండి అందజేశారు. రన్నర్ గా నిలిచిన జట్టుకు డీజే సతీష్ జ్ఞాపకార్థం అతని స్నేహితులు 20,000 అందించారు. గోపాలరావుపేట గ్రామానికి చెందిన నాయకులు బుసి శ్రీను, సత్యనారాయణ, సాంబశివరావు, నరసింహారావు, రామచంద్రు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బిల్లా నాగేందర్, సంతోష్,అశోక్, కోటి, దిలీప్, బృహస్పతి, నాగ మల్లేష్, సుధాకర్ రెడ్డి, శ్రీరామ్ నివేదన్, తదితరులు పాల్గొన్నారు.