4 September, 2026 | 4:21 PM

జీఎస్‌ఎల్‌వీఎఫ్ కౌంట్‌డౌన్

04-09-2026 | 06:15am

షార్ నుంచి నింగిలోకి ఈవోస్

జియోసింక్రోనైస్ కక్ష నుంచి భారత్ తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఇదే

తిరుపతిలో, చెంగాలమ్మ ఆలయంలో ఇస్రోచైర్మన్ ప్రత్యేక పూజలు

అమరావతి, సెప్టెంబర్ 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(Indian Space Research Organisation) ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శుక్రవారం తెల్లవారుజామున శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్ ద్వారా ఈవోఎస్ (భూ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టేందుకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు.

గురువారం ఇస్రో చైర్మన్ నారాయణన్ శాస్త్రవేత్తల బృందం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకొని సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జియోసింక్రోనస్ కక్ష్య నుంచి భారత్ ప్రయోగించనున్న మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం ఇదేనని అధికారికవర్గాలు తెలిపాయి. జీఎస్‌ఎల్‌వీఎఫ్17/ఈఓఎస్-05 మిషన్ కోసం బుధవారం రాత్రి 23:30 గంటలకు 27 గంటల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి, 51.7 మీటర్ల ఎత్తు ఉన్న ఈ రాకెట్ శుక్రవారం 4న తెల్లవారుజామున 2:55 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. జీఎస్‌ఎల్‌వీఎఫ్17 అనేది భారతదేశపు జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ) 19వ ప్రయోగమని ఇస్రో పేర్కొంది. దాదాపు 8 నెలల విరామం తర్వాత శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రయోగం జరగనుంది. ఈ ఉపగ్రహం వాతావరణ పరిశీలన, రక్షణశాఖ, మత్స్య సంపద, వ్యవసాయాధారిత పరిశోధనలు తదితరాలకు చెందిన కీలక సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది.

2367 కేజీల బరువున్న ఉపగ్రహాన్ని 28,934 కి.మీ. ఎత్తున కక్షలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు షార్‌లో రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగానికి సంబంధించిన ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు. జీఎస్‌ఎల్‌వీఎఫ్‌ధి రాకెట్ 19వ సారి నింగిలోకి వెళ్లనుంది. వరుస విజయాలతో దూసుకుపోయే ఈ రాకెట్‌కు ‘నాటీబాయ్’ అనే ముద్దుపేరుతో కూడా పిలవడం విశేషం. కాగా 2021లో జీఎస్‌ఎల్‌వీఎఫ్ ద్వారా ప్రయోగించిన జీశాట్ రాకెట్‌లోని లోపం వల్ల విఫలమైంది. ఆ తరువాత మళ్లీ ఇదే రెండోతరహా ప్రయత్నమని చెప్పుకోవచ్చు.