26 March, 2026 | 1:34 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

క్రీడాకారులకు టీ -షర్ట్స్ పంపిణీ

26-03-2026 12:00 AM

కేకే విరాట్ హాస్పిటల్ వైద్యులు

కరీంనగర్, మార్చి 25(విజయక్రాంతి): స్థానికంగా క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా కేకే విరాట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో టీషర్ట్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ స్వప్న (డీజీవో), డాక్టర్ సురేష్ గౌడ్ (యూరలాజిస్ట్) హాజ రయ్యారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులకు టీషర్ట్స్ అందజేస్తూ, క్రీడలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు.

యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు. డాక్టర్ స్వప్న మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసాన్ని కూడా పెంపొందిస్తాయన్నారు. డాక్టర్ సురేష్ గౌడ్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు క్రీడాకారులకు మరింత ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. కార్యక్రమంలో మేనేజర్ గంగాధర్, మార్కెటింగ్ ఇన్‌చార్జి అందే రాజు, క్రీడాకారులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.