22 April, 2026 | 2:12 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

నరసింహులపల్లిలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

09-04-2026 02:20 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నరసింహులపల్లి గ్రామంలో సీఎం సహాయ నిధి నుండి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్యాడారవేణి భవాని కి రూ.21,500, గ్యాడారవేణి పరుశురాము కు రూ.60,000 చెక్కులను మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరల నరసింహ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రెడ్డిమల్ల నరసయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు కావేటి మల్లేశం, ఉప సర్పంచ్ వేల్పుల శరత్, నాయకులు జనార్దన్ రెడ్డి, లింగా రెడ్డి, డ్యాగ ఎల్లయ్య, సోమిరెడ్డి శ్రీనివాస్, చిట్యాల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.