4 September, 2026 | 8:17 AM

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమా?

04-09-2026 | 04:30am

ఎమ్మెల్యే జీఎంఆర్ 

పటాన్‌చెరు, సెప్టెంబర్ 3 : కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా  మోసం చేస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (MLA Gudem Mahipal Reddy) విమర్శించారు. విద్యార్థి, యువతకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు బిఆర్‌ఎస్ పార్టీ పక్షాన నిరంతర పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 420 మోసాల పైన బిఆర్‌ఎస్ పార్టీ పోరుబాటలో భాగంగా గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానం వేదికగా విద్యార్థులతో కలిసి భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేడు వాటి అమలులో ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు.

పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, విద్యార్థి, యువజన నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.