ఇస్రో చీఫ్ కీలక ప్రకటన

31-10-2026 | 07:13am

నాలుగు ఉపగ్రహాలతో మళ్లీ అందుబాటులోకి నావిక్ సేవలు

శ్రీహరికోట: భారత్ సొంత నావిగేషన్ వ్యవస్థ 'నావిక్ (NaVIC)' మళ్లీ కనీస కార్యాచరణ స్థాయికి చేరుకుంది. తాజాగా NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో నాలుగు ఉపగ్రహాలతో కూడిన Minimum Operational Configuration పునరుద్ధరించినట్లు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. అక్టోబర్ 30న శ్రీహరికోట నుంచి చేపట్టిన GSLV-F18 ప్రయోగం విజయవంతం కావడంతో దేశానికి స్వతంత్రంగా Position, Navigation and Timing (PNT) సేవలు అందించే సామర్థ్యం తిరిగి అందుబాటులోకి వచ్చిందని ఆయన తెలిపారు.

నావిక్ సేవలు మళ్లీ ప్రారంభం..

ఇప్పటికే NVS-01తో సహా మూడు ఉపగ్రహాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, తాజాగా NVS-03 కూడా వాటి సరసన చేరడంతో NaVIC వ్యవస్థ అవసరమైన నాలుగు ఉపగ్రహాల స్థాయికి చేరుకుందని నారాయణన్ వివరించారు. ఈ వ్యవస్థ దేశానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన National Asset అని పేర్కొన్నారు. రైళ్లు, వాహనాలు, నౌకల Real-time Trackingతో పాటు అనేక Civilian Applicationsలో నావిక్ సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'One Nation, One Time' ప్రాజెక్టులోనూ ఈ Navigation Constellation కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.

స్వదేశీ టెక్నాలజీకి ప్రాధాన్యం..

నావిక్ ఉపగ్రహాల్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన Atomic Clocksను కూడా ప్రవేశపెట్టినట్లు ఇస్రో చీఫ్ వెల్లడించారు. వీటి ద్వారా కచ్చితమైన Timing Services అందించేందుకు వీలవుతుందని వివరించారు. మరోవైపు సెప్టెంబర్‌లో ప్రయోగించిన EOS-05 Geo Imaging Satellite కూడా అద్భుతంగా పనిచేస్తోందని, దాని నుంచి అత్యుత్తమ Data అందుతోందని తెలిపారు. NVS-03 ప్రయోగంలో GSLV వాహక నౌకకు సంబంధించిన అన్ని వ్యవస్థలు అంచనాలకు అనుగుణంగా పనిచేశాయని, ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో కచ్చితంగా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.

56 రోజుల్లోనే మరో GSLV ప్రయోగం..

ఈ మిషన్‌లో మరో ప్రత్యేకతను కూడా నారాయణన్ ప్రస్తావించారు. వరుస GSLV ప్రయోగాల మధ్య కేవలం 56 రోజుల వ్యవధిలోనే NVS-03 ప్రయోగాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఇది ఇస్రో ప్రయోగాల నిర్వహణ సామర్థ్యాన్ని తెలియజేస్తోందన్నారు. ఈ విజయానికి కృషి చేసిన శాస్త్రవేత్తలు, ISRO బృందం, పారిశ్రామిక భాగస్వాములు, విద్యాసంస్థలను అభినందించారు. అంతేకాకుండా ఈ మిషన్ బడ్జెట్‌లో దాదాపు 80 శాతం భారతీయ పరిశ్రమలకే కేటాయించినట్లు వెల్లడించారు. దేశీయ పరిశ్రమల భాగస్వామ్యంతో అంతరిక్ష రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్ అడుగులు వేస్తోందని ఈ ప్రయోగం మరోసారి చాటిచెప్పింది.

మరిన్ని వార్తలు