10 రోజుల వెదర్‌పై కీలక అప్‌డేట్

27-09-2026 | 12:04pm

జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో(Jammu Kashmir Weather) మరోసారి వాతావరణం మారే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మేఘావృత పరిస్థితులతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎత్తైన ప్రాంతాల్లో స్వల్ప మంచు కురిసే అవకాశంతో పాటు కొన్ని చోట్ల ఉరుములు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

సెప్టెంబర్ 27, 28 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతంగా ఉండొచ్చు. అక్కడక్కడ కొద్దిసేపు తేలికపాటి వర్షాలు(Jammu Kashmir Rain Alert) పడే అవకాశం ఉంది. ఎత్తైన ప్రాంతాల్లో స్వల్ప మంచు కురిసే ఛాన్స్ ఉండగా, కొన్ని జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 29, 30 తేదీల్లో వాతావరణం(Jammu Weather Forecast) సాధారణంగా పొడిగా ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కొనసాగుతుంది. అక్టోబర్ 1, 2 తేదీల్లోనూ దాదాపు ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉండొచ్చని అంచనా.

అక్టోబర్ 3 నుంచి 5 వరకు మరోసారి వాతావరణంలో మార్పులు కనిపించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఎత్తైన ప్రాంతాల్లో స్వల్ప మంచు పడొచ్చు. కొన్ని చోట్ల ఉరుములు, బలమైన గాలులు వీచే అవకాశం కూడా ఉంది. అక్టోబర్ 6, 7 తేదీల్లో మాత్రం వాతావరణం(Kashmir Weather Forecast) ప్రధానంగా పొడిగా ఉండే అవకాశం ఉందని అంచనా.

రైతులకు సూచనలు

వర్షాలు, బలమైన గాలుల అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా సెప్టెంబర్ 27, 28 తేదీల్లో కోసిన పంటను సురక్షితంగా భద్రపరచాలని సూచించారు. మరోవైపు ఆపిల్, వరి కోతతో పాటు ఇతర వ్యవసాయ పనులకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చని అధికారులు తెలిపారు. మొత్తంగా చూస్తే.. జమ్మూకశ్మీర్‌లో రానున్న రోజుల్లో వాతావరణం ఒకేలా ఉండకుండా వర్షాలు, పొడి వాతావరణం, ఎత్తైన ప్రాంతాల్లో మంచు ఇలా మారుతూ ఉండే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు