20 గంటల నిరీక్షణ!

27-09-2026 | 08:24am

“తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. అసలు సీన్ ఇదే!” 

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ(Tirumala devotees rush today) కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోవడంతో, టోకెన్ లేని భక్తులు బయట ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. టోకెన్ లేకుండా సర్వదర్శనానికి వచ్చే భక్తులకు ప్రస్తుతం సుమారు 20-24(Tirumala darshan waiting time) గంటల సమయం పడుతోంది. దీంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వస్తోంది. మరోవైపు నిన్న 82,181 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే రోజు 37,633 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి కూడా భారీగా కానుకలు వచ్చాయి. నిన్న ఒక్కరోజే హుండీ ద్వారా రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. దీంతో తిరుమలలో భక్తుల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా మరోసారి చర్చనీయాంశంగా మారింది.


మరిన్ని వార్తలు