భగత్‌సింగ్ ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలి
27-09-2026 | 12:08pm
డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కాళంగి హరికృష్ణ
ఇల్లెందు టౌన్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): డీవైఎఫ్‌ఐ(DYFI) ఇల్లెందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో షహీద్ భగత్‌సింగ్(Shaheed Bhagat Singh) జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాళంగి హరికృష్ణ పాల్గొని భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్ చేసిన త్యాగాలు, యువతను చైతన్యపరిచిన ఆయన ఆలోచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. యువత విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.