ఉగ్రవాదంపై భారత్‌ది ‘జీరో టాలరెన్స్’
27-09-2026 | 12:40pm
ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరి ఏమాత్రం మారదని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మరోసారి స్పష్టం చేశారు. తన 138వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని ప్రస్తావించారు. దేశంపై ఉగ్రదాడులు జరిగితే.. వాటికి తగిన సమాధానం తప్పదని మోదీ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న చర్యలకు సర్జికల్ స్ట్రైక్‌ల(Surgical strikes)ను ఉదాహరణగా పేర్కొన్నారు.ఇక దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణనపైనా ప్రధాని మాట్లాడారు.
జనగణన తొలి దశ దాదాపు పూర్తయిందని, ఇప్పటివరకు 32 కోట్లకు పైగా కుటుంబాల సమాచారాన్ని నమోదు చేసినట్లు తెలిపారు.జనగణన అనేది కేవలం లెక్కలు సేకరించే ప్రక్రియ కాదని.. ఇది ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన జాతీయ బాధ్యత అని మోదీ పేర్కొన్నారు