13 ఏళ్ల తర్వాత IAFలోకి మళ్లీ ఎంట్రీ!
న్యూఢిల్లీ: సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత యుద్ధ వితంతువు, స్క్వాడ్రన్ లీడర్ ప్రియాంక సక్సేనాకు(Squadron Leader Priyanka Saxena) కీలక ఊరట లభించింది. సుప్రీంకోర్టు(Supreme Court IAF Case) ఆదేశాల మేరకు ఆమె 13 ఏళ్ల తర్వాత భారత వైమానిక దళం (Indian Air Force)లో తిరిగి చేరనున్నారు. దేశ సేవలో ఉన్న సమయంలో కుటుంబ పరిస్థితులు, సేవా నిబంధనలకు సంబంధించిన అంశాల నేపథ్యంలో విధులకు దూరమైన ప్రియాంక సక్సేనా, తిరిగి సేవల్లోకి తీసుకోవాలని న్యాయపరంగా పోరాటం కొనసాగించారు.
ఈ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు ఆమెకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత ప్రియాంక(Women Officers IAF) మళ్లీ యూనిఫామ్ ధరించనున్నారు. ఈ పరిణామం రక్షణ రంగంలో మహిళల అవకాశాలు, సమాన హక్కుల అంశాలపై మరోసారి చర్చకు దారి తీసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దేశ సేవలోకి తిరిగి అడుగుపెట్టనున్న ప్రియాంక సక్సేనా కథ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.