కోడి ధరల కూత

27-09-2026 | 11:35am

హైదరాబాద్, సెప్టెంబర్ 27, (విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు(Chicken prices) ఒక్కసారిగా కొండెక్కాయి. గణేష్ నవరాత్రులు ముగిశాయో లేదో.. చికెన్‌కు డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరిగిపోయాయి. దీంతో చికెన్ కొనాలంటేనే సామాన్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.కిలో చికెన్‌పై ఏకంగా రూ.30 నుంచి రూ.40 వరకు ధర పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరాలో మార్పులు రావడంతో పాటు, ఇతర వ్యాపార కారణాలు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే.. ఏ ఏరియాలో చూసినా ధరల్లో కాస్త తేడా కనిపిస్తోంది. ప్రస్తుతం స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర రూ.290 నుంచి గరిష్టంగా రూ.300 వరకు పలుకుతోంది. ఇక జిల్లాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. నిజామాబాద్‌లో కిలో చికెన్ ధర దాదాపు రూ.290 వరకు చేరింది.మొత్తానికి.. పండుగలు ముగిశాయని చికెన్ లాగించేద్దామనుకున్న మాంసం ప్రియులకు మాత్రం ధరలు షాకిస్తున్నాయి. మరి ఈ ధరల పెరుగుదల ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి.

మరిన్ని వార్తలు