కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

27-09-2026 | 12:24pm

ఇల్లెందు టౌన్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటం, స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌(BRS) ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. జగదంబా సెంటర్‌లోని దిండిగాల రాజేందర్ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్‌తో పాటు పార్టీ నాయకులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సుదర్శనం రంగనాథ్, అబ్దుల్ నబి, ఎండీ జాఫర్, పరుచూరి వెంకటేశ్వర్లు, గడ్డి శీను, సర్దార్, లలిత్ కుమార్, కిషన్ పాసి, బజారు సత్యనారాయణ, పరకపల్లి రవి, ఎండీ అమీర్, ఇర్పా కాంతారావు, మూలగుండ్ల ఉపేందర్ రావు, మునిగంటి శివ, రాంలాల్ పాసి, సురేష్ సాహు తదితరులు పాల్గొన్నారు


మరిన్ని వార్తలు