అందాల తార ప్రీతి ముండే

27-09-2026 | 05:25am

ప్రయత్నిస్తే విజయం వర్తిస్తుంది. లేకపోతే అనుభవం వస్తుందన్న సిద్ధాంతాన్ని నమ్మి.. పిన్న వయసులోనే అనేక రంగాల్లో తనదైన శైలిలో రాణించి  మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రీతి ముండే.   ప్రతి ఒక్కరిలో ఏదో ఒక అంతర్గతంగా కళ దాగి ఉంటుందని, వాటిని గుర్తించి అందులో రాణించటానికి ప్రయత్నిస్తే తప్పకుండా విజయం దక్కుతుందంటారు. విశ్వ సుందరి కావాలన్నదే తన స్వప్నమని చెపుతున్నారు.

అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి(Heerapur village) చెందిన ప్రీతి ముండే 2023లో బాలీవుడ్ సంస్థ ఫేమీ 9 ఆధ్వర్యంలో నిర్వహించిన అందాల పోటీలో మిస్ హైదరాబాద్ రన్నర్‌గా ఎంపికయ్యారు. జాతీయస్థాయిలో  నిర్వహించిన క్యాట్ వాక్ పోటీల్లో విజేతగా నిలిచారు. మహారాష్ట్ర సంప్రదాయ దుస్తులు ధరించిన ఆమె మరాఠీ నృత్యాన్ని ప్రదర్శించి పురస్కారం అందుకున్నారు. గిరి వనంలో అందాల తారగా వెలుగొందుతున్నారు.

ఇటీవల   రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించిన మిస్ ఎర్త్ వాటర్  ఇండియా. పోటీల్లో విజేతగా నిలిచి కిరీటాన్ని  కైవసం చేసుకున్నారు. పోటీల్లో ఆమె చూపిన  స్నేహపూర్వక  స్వభావానికి గాను మిస్ కంచినియాల్టీ  2026 సొంతం చేసుకున్నారు. ఫిలిపిన్స్‌లో జరగబోయే మిస్ ఎర్త్ అంతర్జాతీయ పోటీల్లో భారతదేశానికి  ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు.

ప్రీతి ముండే నేపథ్యం

అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ముండే ప్రహ్లాద్ దంపతుల కుమార్తె ప్రీతి ముండే. తండ్రి బట్టల వ్యాపారం చేస్తుండగా తల్లి గృహిణి. డిగ్రీ పూర్తి చేసిన ప్రీతి చిన్నప్పటి నుంచి ఆటల్లో, సంస్కృత రంగాల్లో పాల్గొని అందరి మన్ననలు  అందుకుంటున్నది. ఎన్‌సిసిలో ‘సి’ ధ్రువీకరణ పత్రంతో పాటు ఉత్తమ విద్యార్థినిగా పురస్కారం, పసిడి పథకాన్ని సాధించింది. పలు కఠోరమైన ఎన్‌సీసీ శిక్షణ శిబిరాలు పూర్తి చేసింది.

కళాశాల స్థాయిలో నిర్వహించిన అందాల పోటీల్లో రెండుసార్లు భ్యూటీ క్వీన్‌గా కిరీటాన్ని సొంతం చేసుకున్నది. 2021లో ఢిల్లీలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఉపన్యాస పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించి బహుమతి అందుకున్నారు. మహారాష్ట్రలోని యావత్ మాల్‌లో జరిగిన అందాల పోటీల్లో మిస్ మహారాష్ట్రగా ఎంపికయ్యారు. యోగా శిక్షకురాలుగా  సాధకులకు శిక్షణ ఇస్తున్నారు. అడ్వాన్స్‌స్డ్ మెడిటేషన్ అంశంలో కళాశాల విద్యార్థులకు బోధిస్తున్నారు. ఆస్ట్రాలజీ, మేడలింగ్, చిత్రలేఖనంలో ప్రావీణ్యం పొందారు. 


మరిన్ని వార్తలు