క్వార్టర్‌ఫైనల్లో పీవీ సింధుకు ఓటమి
ఆసియా క్రీడలు 2026లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు(PV Sindhu)కు నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైన(Singles quarterfinal)ల్లో చైనా స్టార్ చెన్ యూఫెయ్ చేతిలో సింధు ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.తొలి గేమ్‌లో సింధు అదరగొట్టింది.ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 21-11తో గేమ్‌ను సొంతం చేసుకుంది.దీంతో మ్యాచ్‌పై సింధు పట్టు సాధించినట్టే కనిపించింది.
అయితే రెండో గేమ్ నుంచి పరిస్థితి మారిపోయింది. చెన్ యూఫెయ్ తన ఆటతీరును మార్చుకుని సింధుపై ఒత్తిడి పెంచింది. కీలక పాయింట్ల వద్ద పైచేయి సాధిస్తూ 21-18తో రెండో గేమ్‌ను గెలుచుకుంది.ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో చైనా షట్లర్ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. సింధుకు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా 21-10తో గేమ్‌ను కైవసం చేసుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.మొత్తంగా 21-11, 18-21, 10-21 తుది స్కోరుతో సింధు పోరాటం క్వార్టర్‌ఫైనల్లోనే ముగిసింది.