క్రీడాకారులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ..
- మునుగోడు సర్పంచ్ రమాదేవి నరసింహ గౌడ్
మునుగోడు, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్(Sarpanch Ramadevi Narasimha Goud) దంపతులు హాజరై క్రీడలను తహశీల్దార్ నరేష్, క్రీడల కన్వీనర్ జానయ్య, మండల విద్యాధికారి తల్లమల్ల మల్లేశం,పాఠశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి అన్నారు. చదువుతో పాటు ఆటల్లోనూ విద్యార్థులు రాణించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి" అని పిలుపునిచ్చారు.
తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకుని క్రీడాకారుల ఆరోగ్యం కోసం సర్పంచ్ పోటీల్లో పాల్గొంటున్న 350 మంది క్రీడాకారులకు 10 వేల 500 రూపాయలు విలువైన (ఓఆర్‌ఎస్) ప్యాకెట్లను వారి సొంత ఖర్చులతో అందజేశారు. క్రీడాకారులు అలసటకు గురికాకుండా ఉండటానికి ఈ ప్యాకెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.మునుగోడు వ్యాయామ ఉపాద్యాయులు పిడి ఆధ్వర్యములో క్రీడలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పిడి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.