పెదకాపర్తిలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

06-10-2026 | 09:06pm

చిట్యాల, అక్టోబర్ 06 (విజయ క్రాంతి ): చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామంలో రామన్నపేట లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, యశోద హాస్పిటల్(Yashoda Hospital's) సహకారంతో మంగళవారం ఉచిత వైద్య, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ప్రసాద్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో పెదకాపర్తి సర్పంచ్ కాటం వెంకటేశం, మాజీ సర్పంచ్ కందిమల్ల శశిపారెడ్డి, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు యాదయ్య, ఆనగంటి నరేష్, నీలకంఠం నరేష్, ఏర్పుల నరసింహ, సాగర్ల నాగరాజు, రామన్నపేట లైన్స్ క్లబ్ అధ్యక్షుడు భాస్కరరావు, కార్యదర్శి ఎండి స్మాల్, నరేందర్ రెడ్డి, సింగిరెడ్డి సంజీవరెడ్డి, మర్రి గోపాల్ రెడ్డి, కొత్త నర్సిరెడ్డి, బొరారెడ్డి తదితర సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు