ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా మెడి కృష్ణయ్య

24-11-2026 | 06:20pm

చిట్యాల, నవంబర్ 24 (విజయ క్రాంతి): నల్గొండ జిల్లా చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ(Mandal Congress Party) ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా మెడి కృష్ణయ్య  మంగళవారం నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ), నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం చైర్మన్ బోడ స్వామి అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెడి కృష్ణయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన బోడ స్వామికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నాయకత్వంలో, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత సహకారంతో చిట్యాల మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.

కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సూచించిన మార్గంలో పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పనకు కృషి చేస్తానన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా పనిచేస్తానని పేర్కొన్నారు. యువత, మహిళలు, పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. తన నియామకం పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మెడి కృష్ణయ్యకు అభినందనలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు