కరువు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలి
సీపీఐ డిమాండ్
ఆదిలాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): ఎల్ నీనో ప్రభావంతో పంటలు పండక ఇబ్బందులు పడుతున్న అన్నదాతలను ప్రభుత్వ ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముడుపు ప్రభాకర్ రెడ్డి(Mudupu Prabhakar Reddy) డిమాండ్ చేశారు. మంగళవారం ఉమ్మడి జైనథ్ మండలంలోని పలు గ్రామాల్లోని పంట పొలాలను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు.
అనంతరం జైనథ్ లో మీడియాతో మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడి రాక, పండిన కాస్త పంటను అమ్ముకుందామంటే మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో సైతం అధిక వర్షాలతో నీట మునిగిన పంటలకు ఇప్పటివరకు నష్ట పరిహారం అందలేదన్నారు. వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇందూరు నందు, కుంటాల రాములు, అరిగెల గజారాం, వెంకన్న, రాజేశ్వర్, షేక్ పాషా, ఖండాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.