యావత్ తెలంగాణ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తి నింపింది కేసీఆర్ దీక్ష దివస్

24-11-2026 | 06:25pm

- చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

చొప్పదండి, నవంబరు 24 (విజయక్రాంతి): యావత్ తెలంగాణ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తి నింపింది కెసిఆర్ చేపట్టిన దీక్ష దివస్ అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్(Former MLA Sunke Ravishankar) అన్నారు. ఈనెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ స్ఫూర్తి సభను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు గ్రామంలోని ఆడపడుచులకు బొట్టు పెట్టి సభకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, తీసుకున్న పటిష్టమైన నిర్ణయం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. ఆ చారిత్రక పోరాటాన్ని ప్రజలకు, నేటి తరానికి వివరించడమే దీక్షా దివస్ సభ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు