వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

24-11-2026 | 06:23pm

30 జంటలతో భక్తిశ్రద్ధల మధ్య ప్రత్యేక పూజలు

హుజురాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): హుజూరాబాద్‌లోని పాటి మీద ఆంజనేయస్వామి ఆలయంలో(Anjaneyaswamy Temple) మంగళవారం శ్రీ సత్యనారాయణ స్వామి సామూహిక వ్రతాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు తిరుమలయ్య ఆధ్వర్యంలో సుమారు 30 మంది దంపతులు ఈ వ్రతంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దంపతులు కుటుంబ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సకల శుభాలు కలగాలని శ్రీ సత్యనారాయణ స్వామివారిని ప్రార్థిస్తూ భక్తితో వ్రతాలు ఆచరించారు.

ఆలయ ప్రధాన అర్చకులు తిరుమలయ్యతో పాటు ప్రదీప్ అయ్యా, లలిత్ అయ్యా పూజా కార్యక్రమాల్లో పాల్గొని వ్రత విధానాలను నిర్వహించారు. సామూహికంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

మరిన్ని వార్తలు