బడిలో బతుకమ్మ వెలుగులు

08-10-2026 | 10:12pm

చిన్నారులకు సంస్కృతి పాఠాలు నేర్పిన ఉపాధ్యాయుడు విజయ్

​వెంకటాపురం,(విజయక్రాంతి): మన పండుగలు, సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందనే సందేశంతో ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాల కొత్తూరు MPPS పాఠశాల(Marikala Kothuru MPPS school)లో బతుకమ్మ వేడుకల అవగాహన కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ​పాఠశాల ఉపాధ్యాయుడు కాపుల విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బతుకమ్మ పండుగ(Bathukamma Festival) ప్రాముఖ్యతను విద్యార్థులకు ఆసక్తికరంగా వివరించారు.

తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పూల పండుగ ప్రత్యేకత ఏమిటి? ఒక్కో రోజు బతుకమ్మను ఏ పేరుతో పిలుస్తారు? పూలను ఎలా పేర్చుతారు? అలంకరణ విధానం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటి? అనే విషయాలను పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించారు. ​కేవలం మాటలకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో ఉత్సాహం నింపేందుకు ఉపాధ్యాయుడు విజయ్ స్వయంగా బతుకమ్మ ఆడి చూపించారు.

ఉపాధ్యాయుడితో కలిసి విద్యార్థులంతా ఒకేతాటిపై చేరి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ జానపద గేయాలు పాడుతుంటే పాఠశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది."చిన్నతనం నుంచే పిల్లలకు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తే, మన ప్రాచీన పండుగల ప్రాధాన్యతను భవిష్యత్ తరాలకు సులువుగా అందించవచ్చు" అని పేర్కొన్నారు. ఆటపాటలతో సాగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

మరిన్ని వార్తలు