మేజర్ గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియమించాలి

23-11-2026 | 08:22pm

ప్రజావాణిలో ఎంఈవో జి వి వి సత్యనారాయణ కి వినతి పత్రము..

అందజేసిన జి.ఎస్.పి నాయకులు..

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 23, (విజయక్రాంతి): మేజర్ గ్రామ పంచాయతీకి కార్యదర్శిని నియించాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ నాయకులు(Gondwana Welfare Parishad leaders) సోమవారం ప్రజావాణిలో ఇంచార్జీ వ్యవహరించిన ఎంఈవో జీవి సత్యనారాయణకి వినతి పత్రము అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనెం సాయి దొర మాట్లాడుతూ. వెంకటాపురం మేజర్ పంచాయతీకి కార్యదర్శి లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, గ్రామపంచాయతీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగే ఉందని ఆయన అన్నారు.

మేజర్ పంచాయతీకి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కార్యదర్శి 1/70 ఎల్.టి.ఆర్ చట్టానికి విరుద్ధంగా వలస గిరిజనేతరుల అక్రమ కట్టడాలకు ఇంటి పన్నులు ఇస్తూ ఏజెన్సీ చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.స్థానిక ఆదివాసులకు ఇంటి పన్నుల మంజూరు విషయంలో కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ,వలస గిరిజనేతరులకు కొమ్ముకాస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కేంద్రంగా వలస గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలపై దృష్టి సాధించి, అలాగే వారి ఇంటి పన్నులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఉన్నత అధికారులు వెంటనే ఒక రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్, మండల విద్యార్థి విభాగం నాయకులు పూనెం నితిన్ ,ఉన్నారు.

మరిన్ని వార్తలు