కుడి కాలువల గేట్లను ఏర్పాటు చేయండి.
23-11-2026 | 08:31pm
బోథ్. నవంబర్ 22 ( విజయ క్రాంతి.) మండలంలోని కరత్వాడ ప్రాజెక్టు(Karatwada Project) కుడి కాలువ కాలువ గేట్లను ఏర్పాటు చేసి సాగునీటి వసతి కల్పించాలని మండలంలోని దన్నూర్ కుచిలాపూ ర్ గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ప్రజా వాని కార్యక్రమంలో నోడల్ అధికారి బోత్ ఎంపీడీవో రమేష్కు విన్నవించారు.
ఈ సందర్భంగా వారు తాము ఎదుర్కొంటున్న సమస్యను ఎంపీడీవో దృష్టికి తీసుకువచ్చారు. కుడి కాలువ గేటును ఎవరో దొంగలించారని ఫలితంగా సాగునీరు వృధాగా పోతుందని వారు ఫిర్యాదులో వివరించారు. ఈ విషయంలో తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో విన్నవించారు.