పూజల పేరుతో వృద్ధురాలి ఆభరణాలు చోరీ.. మహిళ అరెస్ట్
బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం.. రిమాండ్‌కు తరలింపు
పటాన్ చెరు, నవంబర్ 23: పూజల పేరుతో నమ్మించి వృద్ధురాలి బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించిన మహిళను పటాన్‌చెరు పోలీసులు(Patancheru police) అరెస్ట్ చేశారు. ఇస్నాపూర్ లేబర్ అడ్డా వద్ద కూలీ పనులు చేసుకునే 70 ఏళ్ల భారతమ్మకు సంద్య అనే మహిళ పరిచయమై, పూజల పేరుతో నమ్మించి నర్సాపూర్‌కు తీసుకెళ్లింది. అనంతరం యాదగిరిగుట్టకు తీసుకెళ్లి కల్లు తాగించి, ఆమె వద్ద ఉన్న సుమారు 2 తులాల బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు, గాజులను దొంగిలించి పరారైంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, నవంబర్ 22న నిందితురాలు సంద్యను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.